Header Banner

ఏపీలో కొత్తగా మరో ఫ్లై ఓవర్! ట్రాఫిక్ సమస్యలకు చెక్! చంద్రబాబు చేతుల మీదగా శంకుస్థాపన!

  Sun May 04, 2025 07:04        Politics

గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకర్ విలాస్ రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. గుంటూరు వాసుల ఎన్నో ఏళ్ల కలను నెరవేరుస్తూ మే ఏడో తేదీన గుంటూరు శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. రెండేళ్లలోగా శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు శంకుస్థాపన కోసం అధికారులు స్థలాన్ని పరిశీలిస్తున్నారు.



గుంటూరు వాసుల ఎన్నో ఏళ్ల కల నెరవేరనుంది. నగరంలో ట్రాఫిక్ కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. గుంటూరు శంకర్‌ విలాస్‌ ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. మే 7వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకర్ విలాస్ రోడ్డు ఓవర్ బ్రిడ్జికి శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన కోసం గుంటూరు నగర పాలక సంస్థ అధికారులు ఇప్పటికే స్థలాన్ని పరిశీలించారు. మరోవైపు గుంటూరు శంకర్ విలాస్ రోడ్డు ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.98 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.



శంకర్‌ విలాస్‌ వంతెన గుంటూరు నగరంలో ట్రాఫిక్‌ పరంగా అత్యంత కీలకమైంది. గుంటూరు ఈస్ట్, వెస్ట్ నియోజకవర్గాలను కలపడంతో పాటు రైల్వేస్టేషన్, మార్కెట్, గవర్నమెంట్, ప్రైవేట్ ఆస్పత్రులు ఇలా దేనికి వెళ్లాలన్నా ఈ వంతెన గుండా వెళ్లాల్సిందే. అయితే ఈ ఫ్లైఓవర్‌ ఇరుకుగా మారడంతోట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే వంతెన శిథిలావస్థకు చేరుకోవటంతో.. శంకర్ విలాస్ రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. అయితే దశాబ్దాలుగా ప్రతిపాదనలకే పరిమితమైన ఈ ప్రాజెక్టులో ఇటీవల కదలిక వచ్చింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో ప్రాజెక్టులో కదలిక వచ్చింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

 
ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే! రూ.647 కోట్లతో.. ఆ రూట్‌లో నాలుగ లైన్లుగా! 



మరోవైపు శంకర్‌ విలాస్‌ రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు డిజైన్లు సిద్ధం చేశారు. రోడ్డు ఓవర్ బ్రిడ్జి కారణంగా నష్టపోయే భవన యజమానులకు ఇప్పటికే పరిహారం కూడా అందించారు. మరోవైపు శంకర్ విలాస్ రోడ్డు ఓవర్ బ్రిడ్జికి కావాల్సిన స్థలాన్ని గుంటూరు నగరపాలక సంస్థ సేకరించాల్సి ఉంది. భూసేకరణ తర్వాత రోడ్లు భవనాల శాఖకు అప్పగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు 120 అడుగుల మేర భూమిని సేకరిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఇప్పటికే మార్కింగ్‌ కూడా పూర్తి చేశారు.



మరోవైపు శంకర్ విలాస్ ఆర్వోబీ నిర్మాణం కోసం అధికారులు పలు డిజైన్లు సిద్ధం చేశారు. గుంటూరు సర్వజనాసుపత్రి మార్చురీ ఎదురు నుంచి అరండల్‌పేట 6 లేదా 7వ లైను వరకు రోడ్డు ఓవర్ బ్రిడ్జి నిర్మించాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇక ఈ వంతెన మీద రాకపోకలు సాగించే వాహనాలు బ్రిడ్జి దిగిన వెంటనే యూటర్న్‌ తీసుకోకుండా సర్వీసు రోడ్లలోకి వెళ్లేలా డిజైన్లు సిద్ధం చేస్తున్నారు. డిజైన్లపై ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చినట్లు తెలిసింది. 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndhraPradesh #FlyoverUpdate #TrafficSolution #NewInfrastructure #UrbanDevelopment #APProgress